: నన్ను సీఎంగా చూడాలని నయీమ్ కోరుకున్నట్టు నేను అనలేదు: ఆర్.కృష్ణయ్య


‘నన్ను సీఎంగా చూడాలని నయీమ్ కోరుకున్నట్టు నేను అనలేదు.. కొన్ని పత్రికలు, మీడియా దీనిని సృష్టించాయి’ అని బీసీ నేత, హైదరాబాదు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల హయాంలోనే గ్యాంగ్ స్టర్ నయీమ్ ను పెంచి పోషించారని అన్నారు. 'టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే పని చేసింది. నయీమ్ ను వాడుకొని, వదిలేశారు. నయీమ్ తో చాలా మంది మంత్రులకు, టీఆర్ఎస్ నేతలకు సంబంధముంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ దందాలతో నాకు సంబంధం లేదు. దమ్ముంటే ఆధారాలు చూపాలి' అంటూ ఆయన డిమాండ్ చేశారు. ‘కృష్ణయ్య నిప్పు.. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. విద్యార్థులు, బీసీల సమస్యలపై పోరాడుతున్నాను. నా ఉద్యమాలు కేసీఆర్ కు ఇబ్బంది కల్గిస్తున్నాయి. అందుకే, నాపై ఆయన కక్ష కట్టారు. గతంలో అందరు సీఎంలు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ నాకే కాదు, ఎవరికీ దొరకడం లేదు. నయీమ్ బాధితులు నన్ను కలిసినప్పుడు, నేను నయీమ్ ను బెదరించేవాడిని. నయీమ్ వల్ల ఈదన్నతో పాటు నా అనుచరుల్లో కొందరిని కోల్పోయా. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక నయీమ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?’ అని క్రిష్ణయ్య ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News