: రకుల్, సమంత నాకు మంచి ఫ్రెండ్స్.. అంతా కలసి బాగా ఎంజాయ్ చేస్తుంటాం!: రెజీనా


టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్, సమంతలతో తనకు మంచి స్నేహం ఉందని సినీ నటి రెజీనా కాసాండ్రా తెలిపింది. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారితో ఉన్న స్నేహం గురించి వివరించింది. రకుల్ ప్రీత్, తాను మంచి భోజన ప్రియులమని తెలిపింది. కొత్త కొత్త డిషెస్ టేస్టు చేస్తుంటామని తెలిపింది. కొత్తగా, రుచికరంగా ఏది దొరికినా తింటామని తెలిపింది. అందులో తమకు అవధులు లేవని తెలిపింది. తిన్న తరువాత రకుల్ బాగా వర్కవుట్స్ చేస్తుందని, ఆమెలా తాను కష్టపడలేనని రెజీనా చెప్పింది. ఇక సమంత, తాను ఒకే ప్రాంతం (చెన్నై) నుంచి రావడంతో తమ ఇద్దరి మధ్య సహజంగానే స్నేహం ఏర్పడిందని తెలిపింది. తామంతా కలిస్తే చాలా ఎంజాయ్ చేస్తామని చెప్పింది. సినిమాలే కాకుండా చాలా అంశాల గురించి మాట్లాడుకుంటామని చెప్పింది. సమంత ఎక్కడికి వెళ్లినా అక్కడి విశేషాలు పంచుకుంటుందని, ఆ ప్రాంతం నచ్చితే 'ఓసారి వెళ్లు' అని చెబుతుందని, అక్కడ ఏ డిష్ బాగుంది, ఏ సలాడ్లు బాగుంటాయి.. వంటి వివరాలన్నీ సమంత చెబుతుందని తెలిపింది. వీలు చిక్కితే తామంతా టూర్లకు వెళ్తుంటామని, అలాంటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామని రెజీనా చెప్పింది.

  • Loading...

More Telugu News