: పెను ప్రమాదం.. విద్యుత్ తీగలు తాకి బస్సులో చెలరేగిన మంటలు.. ఆరుగురి మృతి
ఒడిశాలోని డెంకనాల్ జిల్లా భువన్ వద్ద ఈరోజు పెను ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళుతోన్న ఓ బస్సుకు విద్యుత్ తీగలు తాకడంతో అందులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు కేకలు వేస్తూ ఒక్కసారిగా బస్సులోంచి కిందకు దిగేందుకు యత్నించారు. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.