: గుంటూరు సీఐడీ ఆపీసు వద్ద ఉద్రిక్తత...వైసీపీ నేతల బైఠాయింపు


గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని తుని ఘటనలో చోటుచేసుకున్న సంఘటనలపై సీఐడీ అధికారులు నేటి ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆందోళనతో సీఐడీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News