: అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదు: బీజేపీ నేత రాంమాధవ్
పాకిస్తాన్ దాడులకు దీటైన జవాబు చెబుతామని, అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. పాకిస్తాన్ ఓ బాధ్యతా రాహిత్యమైన దేశమని, దౌత్యపరంగా పాక్ ను ఏకాకిని చేస్తామని అన్నారు. బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తామని, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని రాంమాధవ్ పేర్కొన్నారు.