: యూరీ సెక్టార్‌లో చొరబడేందుకు మళ్లీ ఉగ్రవాదుల యత్నం.. పది మందిని మట్టుబెట్టిన జవాన్లు
జమ్ముకశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు మరోసారి చొరబాటుకి ప్రయత్నించారు. అయితే, అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారి చొరబాటును దీటుగా తిప్పికొట్టింది. పది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాక్ సైనికుల్లా వేషం వేసి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించాలని చూసినట్లు సమాచారం. యూరీ ఘటన తరువాత అక్కడి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న భారత భద్రతాబలగాలు ఉగ్రవాదుల చొరబాటును వెంటనే కనిపెట్టి, దీటుగా జవాబిచ్చాయి. ఆర్మీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పాక్ చేసే కవ్వింపు చర్యలను ఉపేక్షించకుండా దీటుగా సమాధానం చెప్పాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.