: విజయవాడలో మద్యం తాగి వాహనాలు నడిపిన 22 మందికి మూడురోజుల జైలు శిక్ష
మద్యం తాగి వాహనాలు నడపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు ఎక్కువయిపోతుండడంతో విజయవాడ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. తాజాగా చేసిన తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ 22 మంది మందుబాబులని పోలీసులు ఈరోజు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వారందరికీ మూడురోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.