: వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లండి: సైనికులకు రాజ్ నాథ్ ఆదేశం
యూరీ సెక్టార్ లోని లచిపొరా, ఎల్ఓసీ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ దళాలపై విరుచుకుపడమంటూ భారత్ బలగాలను కేంద్రహోం శాఖ మంత్రి రాజ్ నాథ్ ఆదేశించారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాక్ దళాలను సమర్థంగా తిప్పికొట్టాలని అన్నారు. ఈ మేరకు ఆర్మీ డీజీతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. రాజ్ నాథ్ వ్యాఖ్యలు భారత్ బలగాల్లో స్థయిర్యాన్ని మరింత పెంచాయి. కాగా, రెండు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ లోని ఉరీ క్టార్ ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్ర దాడి ఘటనలో 18 మంది జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన మరవక ముందే, సరిహద్దుల్లో పాకిస్తాన్ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.