: జర్మనీలో భారత గూఢచారి అరెస్ట్... ధ్రువీకరించిన అధికారులు!


జర్మనీలో ఉంటూ, భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు రహస్య సమాచారాన్ని పంపుతున్న గూఢచారిని అరెస్ట్ చేసినట్టు జర్మనీ అధికారులు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17న ఆయన్ను అరెస్ట్ చేసినట్టు వెల్లడించిన అధికారులు, అతనిపై చట్ట ప్రకారం విచారణ జరపనున్నట్టు తెలిపారు. జర్మనీ నిబంధనల ప్రకారం, అతని పూర్తి పేరును వెల్లడించలేమని, పొడి అక్షరాల్లో 'టీఎస్ పీ'గా సంబోధిస్తూ, 58 సంవత్సరాల ఈ వ్యక్తి జర్మన్ పౌరుడని, ప్రభుత్వ నార్త్ రైన్ - వెస్ట్ ఫాలియా ఇమిగ్రేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇతను భారత నిఘా వర్గాలకు సమాచారం చేరవేశాడని తెలిపారు. తనకు ఉన్న అధికారంతో ప్రభుత్వ ఫైళ్లను చూసిన ఈయన, సిక్కు తీవ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని గుర్తు తెలియని భారత నిఘా ఏజన్సీలకు పంచుకున్నాడని తెలిపారు.

  • Loading...

More Telugu News