: సైకత శిల్పికి రష్యా సత్కారం


ఒడిసా రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకత(ఇసుక) శిల్పి సుదర్శన్ పట్నాయక్ గురించి చాలా మందికి తెలుసు. ఎప్పటికప్పుడు పూరీ బీచ్ లో వినూత్న ప్రతిబింబాలను ఇసుకపై ఆవిష్కరిస్తూ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన కళాకారుడు. తాజాగా రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ప్రపంచ సైకత కళ పోటీలో మాస్కో చాయిస్ బహుమతి గెలుచుకున్నాడు. ప్రపంచ శాంతిని కోరుతూ 12 అడుగుల వినాయకుడి ప్రతిమను అర్థవంతంగా ఇసుకపై తీర్చిదిద్దినందుకు అతడికీ బహుమానం దక్కింది.

  • Loading...

More Telugu News