: యూరీ సెక్టార్లో పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు
జమ్ముకశ్మీర్‌లోని యూరిలో ఉగ్రవాదులు భారత సైనికులపై దాడి జరిపి వారిని బలిగొన్నందుకు భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న వేళ, పాకిస్థాన్ ఆర్మీ మరోసారి అదే సెక్టార్లో నేడు దుస్సాహసానికి దిగింది. మరోసారి కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించింది. యూరీ సెక్టార్లో 20 రౌండ్ల కాల్పులు జరిపింది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ చర్యలను ఎండగడతామని ప్రధాని మోదీతో పాటు రాజ్‌నాథ్‌సింగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే పాక్ ఈ దుశ్చర్యకు దిగినట్లు తెలుస్తోంది.