: నిమజ్జనం ఊరేగింపులో ‘మానవత్వం’ పరిమళించింది!
ఒక వైపు ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు.. మరోవైపు, డప్పుల చప్పుళ్లకు ఆడిపాడుతున్న వేలాది మంది భక్తులు.. అంతటా సందడి వాతావరణం నెలకొని ఉన్న వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో.. అదే మార్గంలో ‘కుయ్ కుయ్’ అంటూ అంబులెన్స్ ఒకటి వచ్చింది. దానికి దారిచ్చేదేంటిలే, అని అనుకోకుండా... రోడ్డుపై ఉన్న భక్తులు ఎటువారు అటు పక్కకు తప్పుకొని ఆ అంబులెన్స్ కు క్షణాల్లో మార్గం వదిలి తమ మానవత్వాన్ని చాటుకున్న సంఘటన మహారాష్ట్రలోని పుణె లో జరిగింది. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే పది లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. కేవలం రెండే రెండురోజుల్లో 40 వేల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఉండటం, అంబులెన్స్ రాగానే పక్కకు జరిగి, దానికి మార్గం వదలడం స్పష్టంగా కనిపిస్తోంది.