: మన హృదయాల్లో 'ఎవర్ గ్రీన్' హీరో ఎప్పటికీ నిలిచి ఉంటారు: నాగార్జున


ఈరోజు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతి. ఈ సందర్భంగా తనయుడు నాగార్జున తన ‘ఫేస్ బుక్’ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశారు. ‘ఈరోజు 93వ జయంతి, ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ యంగ్ హీరోగా మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఈ సందర్భంగా ‘ప్రేమమ్’ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఈ సాయంకాలం నిర్వహిస్తాం’ అని నాగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రేమమ్’ చిత్రం పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ సందర్భంగా ఒక పోస్ట్ చేసింది. ‘1924, సెప్టెంబర్ 20న.. ఇదే రోజున ఒక లెజెండ్ జన్మించారు. ఆయన జయంతి సందర్భంగా ఆ గొప్ప వ్యక్తిని గుర్తుచేసుకుందాం’ అంటూ అన్నపూర్ణా స్టూడియోస్ పేర్కొంది.

  • Loading...

More Telugu News