: కన్నడ నటి సోనూ గౌడ ప్రైవేట్ ఫోటోలు లీక్... పోలీసులకు ఫిర్యాదు


వివాహమైన తరువాత కూడా హీరోయిన్ గా రాణిస్తున్న కన్నడ నటి సోనూ గౌడ అలియాస్ శృతీ రామకృష్ణ, తన భర్త మనోజ్ తో ఉన్న ప్రైవేట్ చిత్రాలు నెట్ లో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తున్నాయి. వీటిని ఎవరో రహస్యంగా తీశారని ఆరోపించిన సోనూ, నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజులుగా, సోనూ, మనోజ్ లకు చెందిన మూడు ప్రైవేట్ ఫోటోలు నెట్టింట కనిపిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీటిని ఎవరైనా తీశారా? లేదా ఆమె మొబైల్ నుంచి తస్కరించారా? అన్న విషయమై ఆరా తీస్తున్నారు. 2008లో 'ఇంతి నిన్న ప్రీతియా' అనే చిత్రంలో వెండితెరకు పరిచయమై, ఆపై ప్రజా ప్రతినిధి కుమారుడైన మనోజ్ ను వివాహం చేసుకుని, తరువాత కూడా 12 చిత్రాల్లో సోను నటించింది.

  • Loading...

More Telugu News