: అదుపుతప్పి కాలువలో పడిపోయిన స్కూల్ బస్సు.. ఐదుగురు విద్యార్థుల మృతి
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈరోజు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూలు బస్సు విద్యార్థులను ఇంటికి తీసుకువెళుతున్న సమయంలో అదుపుతప్పి అట్టారీ ప్రాంత సమీపంలోని ముహావా కాలువలో పడిపోయింది. ఈ బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలయిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.