: కావేరి జలాల కోసం మాండ్యా రైతుల వినూత్న నిరసన
కావేరి జలాల కోసం కర్ణాటక రాష్ట్ర రైతులు వినూత్న పద్ధతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. మాండ్యా జిల్లాలోని రైతులు మట్టిని తింటూ తమ ఆందోళన నిర్వహించారు. కావేరి జలాలను విడుదల చేయాలంటూ తాజాగా పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కర్ణాటకలో కృష్ణ రాజసాగర్, కబిని జలాశయాల నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం మెట్టూరు డ్యామ్ నుంచి రైతులకు నీళ్లను వదిలింది. కాగా, సుప్రీంకోర్టులో కావేరి నది జలాల వివాదం కేసు విచారణ ఈ రోజు జరగనుంది.