: కేరళ కంటే అందమైన ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి: ఏపీ ముఖ్యమంత్రి చ‌ంద్ర‌బాబు


కేరళ కంటే అందమైన ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు విజ‌య‌వాడ‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని వనరులను సమర్థంగా వినియోగించుకుందామ‌ని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ టెక్నాల‌జీ వాడ‌కాన్ని విస్తృతం చేసి పాల‌న కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఎన్నో న‌ష్టాలు తెచ్చుకున్న ఏపీలో అనేక‌ సమస్యలు ఉన్నాయ‌ని, వాటిని అధిగమిస్తూ వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాల‌ని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత సుదూర తీరప్రాంతం మ‌న సొంత‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఆయ‌న స్పందిస్తూ.. హోదాకి బ‌దులుగా అంతే ప్ర‌యోజ‌నాలు క‌లిగే సాయం చేస్తామ‌ని కేంద్రం చెప్పిందని అన్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని తాము కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News