: ఢిల్లీలో ప్రేమోన్మాది ఘాతుకం.. నడిరోడ్డుపై టీచర్ ను 22 సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడు
దేశరాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలిపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదనే ఆగ్రహంతో సురేందర్‌సింగ్ అనే యువకుడు ఓ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న కరుణ(21) అనే యువతిని అతి దారుణంగా పొడిచి చంపాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటు చేసుకుంది. యువతిని 22 సార్లు కత్తితో పొడిచిన సురేందర్‌సింగ్ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సదరు టీచర్‌ని సురేందర్‌సింగ్ సంవత్సరం నుంచి వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కరుణ ఐదు నెలల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని, అయితే పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది.