: యూరీ వెళ్లనున్న ఎన్ఐఏ టీమ్.. యూఎస్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఉగ్రవాదుల రక్త నమూనాలు?
జమ్ముకశ్మీర్‌లోని యూరిలో ఉగ్రవాదులు భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న దారుణ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఆరుగురు సభ్యులతో ఎన్ఐఏ బృందం ఏర్పాటయింది. యూరి ఘటనపై ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి యూరి ప్రాంతానికి వెళ్లి, హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను పరిశీలించనున్నారు. మృతుల రక్త నమూనాలు, వేలిముద్రలు సేకరిస్తారు. అనంతరం వాటిని యూఎస్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.