: ఎయిర్ ఇండియా 729ను పేల్చేస్తామని హెచ్చరిక... రంగంలోకి భద్రతా దళాలు!


కోల్ కతా నుంచి గౌహతికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 729 విమానాన్ని పేల్చేస్తామని గుర్తు తెలియని ఆగంతుకుల నుంచి హెచ్చరికలు రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఉదయం విమానం బయలుదేరాల్సి వుండగా, ఎయిర్ పోర్టు అధికారులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. విమానాన్ని పేలుస్తామని అవతలి నుంచి హెచ్చరిక రాడవంతో, దాన్ని ఫేక్ కాల్ గా అనుమానిస్తూనే, సమాచారాన్ని భద్రత దళానికి చేరవేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, పారా మిలిటరీ బలగాలు, ఎయిర్ పోర్టుతో పాటు, రన్ వే, చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. విమానాన్ని నిలిపివేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News