: సిరిసిల్లలో బస్సుల అద్దాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఓవైపు చివరి దశకు చేరుకోగా, మరోవైపు తమ ప్రాంతాన్ని జిల్లాలుగా ప్రకటించాలంటూ పలు ప్రాంతాల వాసులు చేస్తోన్న ఆందోళనలు కూడా ఉద్ధృతమవుతూనే ఉన్నాయి. ఈరోజు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బైపాస్ రోడ్‌లో, సిద్ధిపేట డిపోలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితులని అదుపులో తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఆ ప్రాంతవాసులు నినాదాలు చేస్తున్నారు.