: సరికొత్త సాంకేతికత.. సెకనుకు 31 సినిమాలు డౌన్‌లోడ్‌ చెయ్యొచ్చట!


ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో ఇప్ప‌టికే ఎంతో ముందుకు దూసుకొచ్చిన టెక్నాలజీ మ‌రింత పురోగ‌తి సాధించే దిశ‌గా వెళుతోంది. ఇప్ప‌టికే డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 100 జీబీపీఎస్ ఉన్న‌ విష‌యం తెలిసిందే. ఆ వేగం మ‌రో 25 జీబీపీఎస్ వృద్ధి చెంది 125 జీబీపీఎస్‌తో ప‌నిచేయ‌నుంది. అందుకోసం నోకియా సంస్థకు చెందిన బెల్‌-ల్యాబ్స్, జర్మనీలోని టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మునిచ్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఫైబర్‌ నెట్‌వర్క్ టెక్నాల‌జీని అభివృద్ధి చేసింది. ఈ స‌రికొత్త టెక్నాల‌జీని ప‌రిశీలించిన‌ డచ్‌ టెలికాం సంస్థ అందులో అభివృద్ధి చేసిన ప‌లు అంశాల‌ను గురించి వివ‌రించింది. ఈ సాంకేతిక‌తతో ఒక్క‌ సెకనుకు 125 జీబీ వేగంతో డేటాను బదిలీ చేయగలిగినట్లు పేర్కొంది. దీని ప్ర‌కారం ఒక్కోటి 4 జీబీ ఉంద‌నుకుంటే దానితో 31 హెచ్‌డీ సినిమాలు ఒక్క‌ సెకనులోనే డౌన్‌లోడ్ అవుతాయ‌ని చెప్పింది. ఈ టెక్నాల‌జీ పొడవైన ఫైబర్‌ నెట్‌వర్క్‌లోనూ పని చేస్తుందని పేర్కొంది. ఇంటర్నెట్ వేగాన్ని అభివృద్ధి చేయ‌డానికి కొత్త‌ మాడ్యులేషన్ టెక్నాల‌జీని రూపొందించినట్లు చెప్పింది. ఈ సాంకేతిక‌త‌ డేటా బదిలీ వేగాన్ని 30శాతం వరకు అభివృద్ధి చేస్తుంద‌ట‌.

  • Loading...

More Telugu News