: 169 బులెట్లతో ఉగ్రవాదులను తూట్లు పొడిచిన భారత జవాన్లు


సైనికులు చేయించుకునేట్టుగానే పొట్టి క్రాఫ్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చాక్లెట్లు, శరీరానికి శక్తినిచ్చే ఎనర్జీ పానీయాలు, మందులు తదితర వస్తువులతో భారత్ లోకి చొరబడి యూరీలోని బేస్ క్యాంప్ పై భీకర దాడికి దిగిన ఉగ్రవాదుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. వారిని చుట్టుముట్టి భారత జవాన్లు కాల్పులకు దిగిన వేళ, ఉగ్రవాదుల శరీరాలు బులెట్ దెబ్బలకు తూట్లు పడ్డాయి. నలుగురు ఉగ్రవాదుల శరీరంలో మొత్తం 169 బులెట్లు దిగాయని పోస్టుమార్టం చేసిన వైద్య వర్గాలు వెల్లడించాయి. వీళ్లందరి మృతదేహాలనూ యూరీకి 50 కిలోమీటర్ల దూరంలో గుర్తు తెలియని చోట ఖననం చేసినట్టు తెలిపారు. వాళ్ల ఆయుధాలపై కూడా బులెట్ రంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక వారు చొరబడటానికి కొందరు గొర్రెల కాపరులు సహకరించారన్న అనుమానంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. వీరి దగ్గరున్న జీపీఎస్ పరికరాల్లో ఉన్న వివరాలను పరిశీలిస్తే, వారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ నుంచి వచ్చినట్టు తెలుస్తోందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News