: ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే చూడాలని ఉంది.. తొలిసారి పెదవి విప్పిన రాహుల్


సోదరి ప్రియాంక రాజకీయ అరంగేట్రంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తొలిసారి పెదవి విప్పారు. తన సోదరి రాజకీయాల్లోకి వస్తే చూడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెడితే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. అయితే ఆమె రాజకీయాల్లోకి రావాలో? వద్దో? నిర్ణయించుకోవాల్సింది మాత్రం ఆమేనని స్పష్టం చేశారు. తాను ఎక్కువగా నమ్మేది ప్రియాంకనేనని పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో ప్రియాంక రాజకీయ అరంగేట్రంపై మరోమారు ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె రాజకీయాల్లోకి రావాలంటూ కాంగ్రెస్ నాయకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాహుల్ బీజేపీ, ఆరెస్సెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆరెస్సెస్ ఎలా చెబితే అలా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. యూపీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News