: కట్జు వ్యాఖ్యలకు హుందాగా స్పందించిన అమితాబ్.. తన బుర్రలో నిజంగానే ఏమీ లేదన్న బిగ్‌బీ


సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అన్నట్టు తన బుర్రలో ఏమీ లేదని బాలీవుడ్ స్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే జస్టిస్ కట్జు ఇటీవల అమితాబ్‌ను ఉద్దేశించి ‘ఆయన బుర్రలో ఏమైనా ఉందా?’ అనే సందేహాన్ని ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చారు. జస్టిస్ కట్జు వ్యాఖ్యలపై స్పందించిన బిగ్ బీ ‘‘నిజమే, నా బుర్రలో ఏమీ లేదు. అది ఖాళీ అయిపోయింది’’ అంటూ హుందాగా సమాధానమిచ్చారు. తాను, కట్జు ఒకే స్కూల్‌లో చదువుకున్నామని, ఆయన తనకంటే సీనియర్ అని పేర్కొన్న అమితాబ్ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఓ సమావేశంలో స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News