: తెలంగాణలో దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల షెడ్యూల్
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ విద్యాసంవత్సరంలో సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 12 వరకూ దసరా సెలవులు ఉంటాయని డీఈఓలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆపై డిసెంబర్ 24 నుంచి 28 వరకూ క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు, 2017లో జనవరి 11 నుంచి 15 వరకూ సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవుల అనంతరం జూన్ 12న తదుపరి విద్యా సంవత్సరం మొదలవుతుందని పేర్కొంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3లోగా ఎస్ఏ-1 (సమ్మెటివ్ అసెస్ మెంట్-1) పరీక్షలు, వచ్చే సంవత్సరం మార్చి 7 నుంచి 15 వరకూ ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 18 వరకూ నిర్వహించాలని, వార్షిక పరీక్షలను మార్చి తొలి వారంలోనే ప్రారంభిస్తామని తెలిపింది.