: శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేసిన సినీ నటి అనిత.. సంతానం కోసమే వచ్చినట్టు వెల్లడి
సినీ నటి అనిత సోమవారం శ్రీకాళహస్తిలో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఆమె రాహుకేతు పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ఆవరణలోని పొగడ చెట్టు వద్ద ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ కాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజ చేయించుకుంటే సంతానం కలుగుతుందని స్నేహితులు చెప్పడంతో ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. తాను నటించిన 'మనలో ఒకడు' సినిమా విజయవంతం కావాలని శివపార్వతులను కోరుకున్నట్టు అనిత పేర్కొన్నారు. ఆలయ శిల్ప సౌందర్యం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.