: ప్రియురాలిని హత్య చేసి నగదుతో పారిపోయిన నిందితుడి అరెస్టు
ప్రియురాలిపై అత్యాచారానికి యత్నించి, ఆపై హత్య చేసి, ఆమె వద్ద ఉన్న నగదు తీసుకుని పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గండిపేట వద్ద బాలిక హత్య కేసులో నిందితుడు అక్బర్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, 'అక్బర్, చాంద్రాయణ గుట్ట పరిధిలోని బండ్లగూడకు చెందిన నహీమా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నసీమా ఇంటి నుంచి రూ.40 వేలు, బంగారం తీసుకుని తన ప్రియుడితో కలిసి నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గండిపేట వద్దకు వారు వెళ్లారు. అక్కడ నసీమాపై అక్బర్ లైంగిక దాడికి యత్నించాడు. దీనిని ప్రతిఘటించిన నసీమా చేతిని కోసేసిన అక్బర్, బండరాయితో ఆమెను కొట్టి చంపాడు. బాలిక వద్ద ఉన్న నగదు, బంగారం తీసుకుని అక్బర్ పరారయ్యాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని 10 గంటల్లోనే అరెస్టు చేశాం' అని తెలిపారు.