: 500 వంటకాలతో 500 టెస్టును చరితార్థం చేయనున్న బీసీసీఐ


భారత క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్ జట్టుతో ఆడబోతున్న ప్రతిష్టాత్మక 500వ టెస్టు మ్యాచ్‌ ను చిరకాలం గుర్తుంచుకునే ఏర్పాట్లు చేయడంలో బీసీసీఐ మునిగిపోయింది. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు, క్రికెటర్లు, కోచ్ లు, బోర్డుల అధ్యక్షులు, సభ్యులు ఇలా ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్న బీసీసీఐ ఆ రోజు విందును ప్రత్యేకంగా, చిరకాలం గుర్తుంచుకునేలా సుమారు 500 వంటకాలతో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆ మ్యాచ్ రిఫరీగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ సునీల్‌ యాదవ్‌ ను ఐసీసీ నియమించింది. గురువారం నుంచి ఈ మ్యాచ్ కాన్పూర్‌ వేదికగా జరగనుంది.

  • Loading...

More Telugu News