: మన కోచ్ లే గొప్ప...స్వర్ణంపై గురిపెట్టా: దీపా కర్మాకర్


అత్యుత్తమ సౌకర్యాలు, విదేశీ కోచ్ లపై మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో విదేశీ కోచ్ ల కంటే స్వదేశీ కోచ్ లే గొప్ప అని జిమ్నాస్టిక్స్ లో భారత ఆశలు మోసిన దీపా కర్మాకర్ అభిప్రాయపడింది. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, విదేశీ కోచ్ ల కంటే స్వదేశీ కోచ్ లే గొప్ప అని చెప్పేందుకు ఉదాహరణ...రియో ఒలింపిక్స్‌ లో రజతం, కాంస్యం గెలిచిన సింధు, సాక్షిల కోచ్‌ లు భారతీయులేనని పేర్కొంది. తన వరకు మన భావాన్ని అర్థం చేసుకోగల మన కోచ్‌ లే ఉత్తమమని పేర్కొంది. తదుపరి ఒలింపిక్స్‌ లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌ లో వరల్డ్ నెంబర్ వన్, అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ను ఓడించడమే లక్ష్యమని చెప్పింది. ‘సిమోన్‌ బైల్స్‌ అత్యుత్తమ క్రీడాకారిణి. ఆమెను ఓడించడమే నా లక్ష్యం. అందుకు తగ్గట్టే నేను సిద్ధమవుతున్నా. ఒకవేళ ఆమె కంటే ఉత్తమ ప్రదర్శన చేయలేకపోతే కనీసం రజతంతోనైనా సరిపెట్టుకుంటా’ అని తెలిపింది.

  • Loading...

More Telugu News