: పాక్ కు మంటపుట్టించే నిర్ణయం తీసుకోనున్న భారత్


ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఎలాంటి ప్రతిచర్యకు దిగనుందనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ లో ఉగ్రవాదానికి ప్రధాన కారణం పాకిస్థాన్ అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇదే విషయం ప్రపంచానికి మరోసారి చాటడంతో పాటు, స్విట్జర్లాండ్ లో ఆశ్రయం పొందుతున్న బెలూచిస్థాన్ రిపబ్లికన్ పార్టీ అగ్రనేత బ్రాహుందాఘ్ బుగ్తీకి రాజకీయ ఆశ్రయం కల్పించే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా బెలూచిస్థాన్ కు ప్రధాని మోదీ మద్దతు తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన, బుగ్తీ త్వరలో తాను ఆశ్రయం కోసం భారత్ కు దరఖాస్తు చేసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా దాడుల నేపథ్యంలో ప్రతిదాడికి దిగితే ప్రపంచం ముందు దోషిగా నిలబడతామని, అంతే కాకుండా ఆయనకు ఆశ్రయం కల్పించడం ద్వారా పాకిస్థాన్ కు సరైన సమాధానం చెప్పవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బెలూచిస్థాన్ ఉద్యమం నడిపిన నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ తన మనవడు బ్రాహుందామ్ భుగ్తీతో కలిసి క్వెట్టాలోని రహస్య స్థావరంలో ఉండగా, పాక్ ఆర్మీ జరిపిన దాడిలో నవాబ్ అక్బర్ బుగ్తీ మరణించగా, ఆయన మనవడు మాత్రం ప్రాణాలతో బయటపడి స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. అక్కడే ప్రవాస జీవితం గడుపుతున్నారు. తాజా దాడుల నేపథ్యంలో ఆయనకు రాజకీయ ఆశ్రయం ఇస్తే..పాక్ కు సరైన సమాధానం చెప్పినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది.

  • Loading...

More Telugu News