: అఖండ గోదావరి ప్రాజెక్టును అందుకే ప్రకటించాను: సీఎం చంద్రబాబు నాయుడు


గోదావరి జిల్లాలు అంటే తనకెంతో ఇష్టమని, అందుకే, అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మధురపూడి విమానాశ్రయం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ను విస్తరిస్తున్నామని, రన్ వే పూర్తయితే అన్ని రకాల విమానాలు రాత్రింబవళ్లు తిరుగుతాయని, తద్వారా టూరిస్ట్ లు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి వస్తారని అన్నారు. టూరిస్ట్ లు, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. కాకినాడలో మరో ఓడరేవు నిర్మిస్తున్నామని, కాకినాడ-చెన్నై వరకూ జలరవాణాకు బకింగ్ హామ్ కాలువ నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News