: నేను వెంకయ్యనాయుడులా మాట్లాడలేను...గురజాడ చెప్పింది చేస్తున్నాను: అశోక్ గజపతిరాజు


కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆసక్తికర వ్యాఖ్యతో ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎయిర్ పోర్టు విస్తరణ శంకుస్థాపన పనులు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులా ఛలోక్తులు విసురుతూ, ఆకట్టుకునేలా తాను మాట్లాడలేనని అన్నారు. అయితే మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు 'వట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి మేల్ తల పెట్టవోయ్' అన్నట్లుగా వట్టి మాటలు కట్టిపెట్టి రాష్ట్ర ప్రజలకు గట్టి మేలు తలపెడుతున్నానని అన్నారు. సాధారణంగా పెద్దగా మాట్లాడని అశోక్ గజపతిరాజు చమత్కరించేసరికి సభికులు పెద్దపెట్టున నవ్వేశారు.

  • Loading...

More Telugu News