: నన్ను నమ్ముకుని చాలా మంది పార్టీ మారారు.. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది: దేవినేని నెహ్రూ


తనను నమ్ముకుని చాలామంది పార్టీ మారారని టీడీపీ నేత దేవినేని నెహ్రూ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను నమ్ముకుని పార్టీ మారిన వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. తాను టీడీపీలో చేరినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై సమాధానం చెప్పలేనని అన్నారు. తాను పార్టీలో చేరడం వారికి మింగుడుపడకపోతే, వారి గొంతులో నీళ్లు పోసి చంద్రబాబే మింగుడుపడేలా చేస్తారని ఆయన తెలిపారు. పార్టీలో చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. అయితే తనను ఎలా ఉపయోగించుకుంటారనేది ఆయన ఇష్టమేనని తెలిపారు. కాగా, నెహ్రూతో పాటు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కూడా పార్టీ మారిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News