: మమ్మీ.. డాడీ..బీడీ..జాడీ..కేడీ ఇవన్నీ వదిలేయండి: వెంకయ్య నాయుడు


ఏ అంశంపైన అయినా గుక్కతిప్పుకోకుండా, తడబడకుండా, సమాచారం కోసం వెతుక్కోకుండా మాట్లాడే అద్భుత వక్త కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, ఛలోక్తులు, చురకలు, పిట్టకథలతో తన ప్రసంగాన్ని రక్తి కట్టించడమే కాక, అతిథులను, ఆహూతులను కడుపుబ్బ నవ్వించడంలో ఆయన శైలే వేరు. తాజాగా, కృష్ణా జిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో జరిగిన బెల్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జరిగిన సభలో వెంకయ్యనాయుడు ప్రసంగమే ఇందుకు నిదర్శనం. ‘మన పిల్లలకు కూడా చెబుతుంటారు మీరు. మమ్మీ, డాడీ అను అని. మమ్మీ.. డాడీ..బీడీ..జాడీ.. కేడీ ఇవన్నీ వదిలేసి అమ్మ, నాన్న, అన్న, అక్కయ్య, బావ, మరదలు అని అనుకునే పరిస్థితి రావాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు. ఆ సభ జరుగుతున్న సమయం లంచ్ సమయం కావడంతో ‘యాక్చువల్ గా ఇది మీటింగ్ టైం కాదు, ఈటీంగ్ టైం’ అని అంటూ తనదైన శైలిలో ఫినిషింగ్ చమక్కు ఇచ్చారు.

  • Loading...

More Telugu News