: జపాన్‌లో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారిలో సగం మంది బ్రహ్మచారులేనట!
మామూలుగా అమ్మాయిలు 19 ఏళ్లు నిండాకా, అబ్బాయిలు 23 ఏళ్లు నిండాకా పెళ్లి చేసుకుంటారు. అయితే, వృద్ధుల జనాభా ప్రపంచంలోనే అధికంగా ఉన్న జపాన్‌లో పెళ్లి కావలసిన వాళ్ల సంఖ్య కూడా అధికమేనట. 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీపురుషుల్లో దాదాపు సగం మంది బ్రహ్మచారులేనట. వారిలో పురుషుల శాతం 42గా ఉందని, మహిళల శాతం 44.2గా ఉందని తాజాగా నిర్వహించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాప్యులేషన్ అండ్ సోషల్ సెక్యురిటీ రీసెర్చ్ ద్వారా తెలిసింది. 2010లో జపాన్‌లో ఇదే అంశంపై జరిపిన సర్వేలో 36.2 శాతం మంది పురుషులు, 38.7 శాతం మంది మహిళలు బ్రహ్మచారులుగా ఉన్నారని తేలింది. తాజాగా నిర్వహించిన సర్వేలో బ్రహ్మచారులుగా ఉన్న పురుషుల్లో 70 శాతం మంది, మహిళల్లో 60 శాతం మంది తమకు ఎలాంటి సెక్స్ అనుభవం లేదని తెలిపారు. అయితే వారిలో 30 శాతం మంది పురుషులు, 26 శాతం మంది మహిళలు భవిష్యత్తులో ఈ అనుభవాన్ని కోరుకుంటున్నట్టు సర్వే ద్వారా తెలిసింది. ఈ పెళ్లికాని వారిలో భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న వారు 90 శాతంగా ఉన్నారని చెప్పారట. అయితే తమ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం చెప్పలేం అని చెప్పేశారు.