: 'కింగ్‌ఫిషర్‌' పక్షిలాగే విజయ్ మాల్యా ఎగిరిపోయారు: బాంబే హైకోర్టు


భారతీయ బ్యాంకుల్లో రూ.9 వేల కోట్లు అప్పుచేసి, తిరిగి చెల్లించకుండా విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాపై సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగం దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు బాంబే హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. మాల్యాకు చెందినా ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్‌కు మళ్లీ వేలం వేయాలని సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగం కోరింది. మాల్యా సర్వీస్‌ ట్యాక్స్‌కు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము 532 కోట్ల రూపాయ‌ల‌ని తెలిపింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం ఆయ‌న‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మాల్యా త‌న కంపెనీకి ‘కింగ్‌ఫిషర్‌’ అనే పేరు సరిగ్గా సూట‌య్యేలా పెట్టుకున్నార‌ని కోర్టు వ్యాఖ్యానించింది. కింగ్‌ఫిషర్‌ పక్షిలాగే ఆయన విదేశాల‌కు ఎగిరిపోయార‌ని కోర్టు పేర్కొంది. సరిహద్దులతో సంబంధం లేకుండా స‌ద‌రు వ్యాపార‌వేత్త‌ ఎగిరిపోయారని వ్యాఖ్యానించింది. ‘కింగ్‌ఫిషర్‌’ అనే పేరును అచ్చుగుద్దిన‌ట్లు అంత‌గా సూటయ్యేలా ఏ సంస్థా ఇంతవ‌ర‌కు పేరు పెట్టలేదని కోర్టు పేర్కొంది. హ‌ద్దులు దాటి ఎగిరిపోయిన మాల్యాను ఎవ్వరూ ఆపలేదని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News