: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నల్లకుంట శాఖ మేనేజర్ శ్రీనివాసాచారి రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాద్రి టౌన్ షిప్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆయన తన ప్లాట్ లోని గదిలో ఉరివేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు ఇంటికి వచ్చేటప్పటికి తలుపులు తెరచి ఉండకపోవడంతో, అనుమానం వచ్చి, వాటిని పగులగొట్టారు. అప్పటికే ఉరి వేసుకున్న ఆయన్ని చూసి కుటుంబసభ్యులు విలపించారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే ఆయన ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.