: బీహార్‌లో ఘోర ప్రమాదం.. చెరువులో పడిన బస్సు.. నలుగురి మృతి
బీహార్‌లోని మధుబని వద్ద ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీతామర్హి నుంచి మధుబని ప్రాంతానికి వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి చెరువులో పడిపోయింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపడుతూ పోలీసులకి సమాచారం అందజేశారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఘటనాస్థలిలో రెస్క్యూ టీమ్ స్థానికులతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తోంది. బస్సు అతివేగంతో రావడమే ప్రమాదానికి కారణమయినట్లు తెలుస్తోంది.