: అసోంలో హింసాత్మకంగా మారిన ఆక్రమణల తొలగింపు


ఆక్రమణల తొలగింపులో పోలీసుల‌కి, స్థానికుల‌కు మ‌ధ్య‌ తీవ్ర‌ వివాదం చోటుచేసుకొని ఇద్దరు గ్రామ‌స్తులు మృతి చెందిన ఘ‌ట‌న ఈరోజు అసోంలోని కజిరంగ జాతీయ పార్కు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మరో ఐదుగురికి గాయాల‌య్యాయి. ఆ ప్రాంతంలోని బండేర్డుబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసాలు ఏర్ప‌ర‌చుకొని స్థానికులు జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నారు. గౌహ‌తి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేర‌కు పోలీసులు ఈరోజు అక్క‌డి వారిని ఖాళీ చేయించ‌డానికి వెళ్లారు. అయితే తాము ఆ ప్రాంతంలో ఎప్ప‌టి నుంచో ఉంటున్నామంటూ, పరిహారం చెల్లించేంతవరకు వెళ్ల‌బోమంటూ పోలీసుల‌పై తిర‌గబ‌డ్డారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వ‌డంతో పోలీసులు మొద‌ట బాష్ప‌వాయువుని ప్ర‌యోగించి, అనంత‌రం కాల్పులు జ‌రిపారు.

  • Loading...

More Telugu News