: తుమ్మల ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్... ముఖ్యమైన తేదీలివే
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన వెలువరిస్తూ, ఈ నెల 26 నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపింది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 3 ఆఖరు తేదీ అని, అక్టోబర్ 17న ఎన్నిక జరిపి అదే రోజున ఫలితాలు వెలువరిస్తామని తెలిపింది. కాగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఫరీదుద్దీన్ ను బరిలోకి దించుతామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ గా ఉన్న తుమ్మల, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి పాలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.