: కర్నూలు జిల్లాలో ద్విచక్రవాహనంలోకి దూరిన పాము
కర్నూలు జిల్లా సున్నిపెంటలోని నల్లమల అడవి ప్రాంతంలో ఓ పాము ద్విచక్ర వాహనంలోకి దూరింది. వాహనదారుడు సేదతీరేందుకు వాహనం ఆపగా ద్విచక్రవాహనంలోని హెడ్‌లైట్‌లోకి పాము దూరిపోయింది. పాము ఉన్న విషయాన్ని గమనించిన వాహనదారుడు వెంటనే ఆ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న సిబ్బంది అరగంట పాటు శ్రమించి పామును బయటకు తీశారు. పాముని బంధించి ఓ పొడవాటి సీసాలో వేసిన సిబ్బంది అనంతరం దాన్ని తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.