: బీపీ కూడా చూడలేని కామినేని శ్రీనివాస్ కు ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చింది?: వైకాపా
కనీసం రక్తపోటును పరీక్షించడం కూడా చేతగాని కామినేని శ్రీనివాస్ కు ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందని వైకాపా మండిపడింది. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైకాపా ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్రమంతటా జ్వరాలతో బాధపడుతుంటే, వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డెంగీ, చికున్ గున్యాల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తక్షణం కామినేని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆలోచనంతా కేసులు, కాంట్రాక్టుల్లో వాటాలు, కమిషన్లపై ఉందని, మంత్రులు తమకొచ్చే కమిషన్లపై దృష్టిని పెట్టి ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.