: ఉగ్రదాడి తరువాత నాలో కలిగే భావాలను వివరించలేను: విరాట్ కోహ్లీ
జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడిని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించాడు. ఉగ్రదాడిలో అసువులుబాసిన 17 మంది సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపాడు. ఉగ్రదాడికి సంబంధించిన ఫోటో చూసిన తరువాత తనలో చెలరేగిన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని అన్నాడు. ఆ భావోద్వేగాలను వెల్లడించేందుకు మాటలు కూడా రావడం లేదని తెలిపాడు. ఇలాంటి అమానవీయ ఘటనల వల్ల సాధించేది ఏముంటుందని కోహ్లీ ఉగ్రవాదులను ప్రశ్నించాడు. ఈ మేరకు యూరీ సెక్టార్ పై జరిగిన దాడికి సంబంధించిన ఓ ఫోటోను కోహ్లీ ట్వీట్ చేశాడు.