: ఏపీలో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారు: కేటీఆర్ తో టీ.ఉద్యోగ సంఘం నేతలు
ఏపీలో పనిచేస్తోన్న నాలుగో తరగతి ఉద్యోగులను బదిలీ చేయాలని హైదరాబాద్‌లో టీఎన్జీవో భవన్లో ఉద్యోగులు పెట్రోల్ బాటిళ్లను పట్టుకొని చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఉద్యోగ సంఘం నేతలు వారి డిమాండ్లపై మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపి సఫలమయ్యారు. ఏపీలో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఉద్యోగుల సంఘం నేతలు మంత్రికి వివరించారు. దీంతో దసరాలోపు ఉద్యోగులందరినీ తెలంగాణకి తీసుకొస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు టీఎన్జీవో భవన్‌కి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు నిరసనను విరమించాలని కోరుతున్నారు.