: వెంకయ్యనాయుడుగారిని విమర్శిస్తే మనకొచ్చే లాభమేంటి?: సీఎం చంద్రబాబు


‘ఏపీకి సాయం విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారిని కొంతమంది విమర్శిస్తున్నారు. ఆయన్ని విమర్శిస్తే మనకొచ్చే లాభమేంటని నేను అడుగుతున్నాను. ఆయన ఎక్కడ తప్పుచేశారని అడుగుతున్నాను’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా జిల్లా నెమ్మలూరులో బీహెచ్ఈఎల్ సంస్థ ఏర్పాటుకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 'రాష్ట్రానికి మేలు చేసేందుకు అనునిత్యం కేంద్రంతో మాట్లాడుతూ, అక్కడ జరిగే సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వెంకయ్యనాయుడును విమర్శించేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి' అని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ ఏనాడూ రాజీపడలేదని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఏపీ ప్యాకేజ్ కు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని, అన్ని విషయాలను ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాలని వెంకయ్యనాయుడికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతంలో బెల్ ప్రాజెక్టును రెండేళ్లలోగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉద్యోగాలు వస్తాయని, తద్వారా యువత బాగుపడుతుందని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News