: మౌనదీక్షకు సిద్ధమైన కోదండరాం.. భూసేకరణ నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ఉందని విమర్శ
తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం వచ్చే గాంధీజయంతి (అక్టోబర్ 2) నాడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మౌనదీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపైనే తాము మౌనదీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ఉందంటూ ఆయన విమర్శించారు. మల్లన్నసాగర్ డీపీఆర్ ఇంతవరకు పూర్తికాలేదని, భూసేకరణ ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రభుత్వాధికారులు సేకరించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తారన్న అనుమానంలో భూములు ఇచ్చిన రైతులు ఉన్నారని ఆయన చెప్పారు.