: నెమ్మలూరులో బెల్ సంస్థకు భూమిపూజ చేసిన చంద్రబాబు
కృష్ణా జిల్లా నెమ్మలూరులో బెల్ కర్మాగారానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో బెల్ ను ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారంలో రక్షణ శాఖకు అవసరమైన అడ్వాన్స్ నైట్ విజన్ లెన్స్ తయారు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.