: చదివేది బీటెక్, చేసేది చైన్ స్నాచింగ్... చిక్కిన హైదరాబాద్ యువకుడు


బీటెక్ చదువుతున్న ఓ యువకుడు, తన జల్సాలను తీర్చుకునేందుకు పెడదారి పట్టి సీసీ కెమెరాల పుణ్యమాని అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రవికుమార్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం ఎల్ బీ నగర్, రాక్ టౌన్ కాలనీలో రహదారిపై వెళుతున్న ఓ మహిళ మెడ నుంచి రెండు తులాల చైన్ ను తెంపుకు పోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ దారిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, రవికుమార్ ను గుర్తించి అరెస్ట్ చేసి, బంగారు గొలుసును రికవరీ చేశారు. సీసీటీవీ వీడియోను అక్కడి స్థానికులకు చూపగానే రవికుమార్ ను గుర్తించారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News