: గుజరాత్ ఎన్నికల్లో గెలవలేము... కాంగ్రెస్ సొంత సర్వే!


వచ్చే సంవత్సరం గుజరాత్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవని, ఆ పార్టీ నిర్వహించిన సొంత సర్వేలో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాలను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి పార్టీ నేతలు అందించినట్టు తెలుస్తోంది. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్న గుజరాత్ లో 97 సీట్లను బీజేపీ గెలుస్తుందని కాంగ్రెస్ కు 85 సీట్ల వరకూ రావచ్చని అంచనా వేసింది. ప్రొఫెషనల్స్ నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందన్న సీట్లు 52 ఉన్నాయని ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాలని చెబుతూ, మరో 45 చోట్ల 80 శాతం నుంచి 85 శాతం వరకూ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నట్టు సమాచారం. కాంగ్రెస్ కు వచ్చే 85 సీట్లతో ప్రభుత్వాన్ని స్థాపించలేమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పే సీట్లు 8 మాత్రమేనని తమ సొంత సర్వేలో తేలినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News